Dornala: పెద్దదోర్నాలలో భూవివాదం కలకలం: జనసేన, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత!
Dornala: పెద్దదోర్నాల జాతీయ రహదారిపై హరివిల్లు హోటల్ స్థలం వివాదంలో జనసేన, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Dornala: పెద్దదోర్నాలలో భూవివాదం కలకలం: జనసేన, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత!
Dornala: పెద్దదోర్నాల పట్టణంలోని కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్థలం విషయంలో వివాదం చెలరేగడంతో హరివిల్లు హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం మేరకు, పెద్దదోర్నాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కేతి వెంకట మురళీకి చెందిన స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ అబ్దుల్ మజీద్ లీజుకు తీసుకుని, అక్కడ తాత్కాలికంగా "హరివిల్లు" పేరుతో హోటల్ నిర్మించి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని తనకు అప్పగించాలని కోరుతూ కేతి వెంకట మురళీ హోటల్ వద్దకు చేరుకుని, హోటల్లోని సామగ్రిని బయటకు తీసివేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
అయితే, హోటల్‌ను ఖాళీ చేసేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని షేక్ అబ్దుల్ మజీద్ కోరినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పెద్దదోర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి చెదరగొట్టారు.




