Pallipalem: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: పల్లిపాలెంలో జనసేన సన్నాహక భేటీ
Pallipalem: పల్లిపాలెంలో నిర్వహించిన జనసేన ఎన్నికల నిర్వహణ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ నేతలు దిశానిర్దేశం చేశారు.
Pallipalem: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: పల్లిపాలెంలో జనసేన సన్నాహక భేటీ
Pallipalem: నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణ సమీక్ష సమావేశం పల్లిపాలెం జె.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం జనసేన నాయకులు గోదశి పుండరీష్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో సమన్వయం, ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణులను మరింత సమర్థంగా సన్నద్ధం చేసే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ,ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ముత్యాల జయలక్ష్మి,గిడ్డి రత్నశ్రీ, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు జనసేన నాయకులు గుద్దటి జమ్మి, దూడల స్వామి, కర్రా దుర్గాప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాల ప్రసాద్, అత్తిలి బాబురావు, గుద్దటి విజయ్, గాలిదేవర బుల్లి, బద్రి రమా, నూకల దుర్గ, లంకలపల్లి రాణి, రంబాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




