Kothapeta: కొత్తపేటలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలు పాల్గొన్న బండారు సందీప్!
Kothapeta: కొత్తపేటలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్షించారు.
Kothapeta: కొత్తపేటలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలు పాల్గొన్న బండారు సందీప్!
Kothapeta: భారతదేశం అభివృద్ధిలో మరింత ముందుకు సాగి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని, స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన జాతీయ పండుగ అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నేడు, రేపు, ఎల్లుండి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా చూడాలని ఆయన తెలియజేశారు.
శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఆలమూరు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించారు. కొత్తపేట తెలుగుదేశం మండల అధ్యక్షులు గనిశెట్టి వీరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం వానపల్లిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బండారు కృష్ణ సందీప్ పాల్గొన్నారు.
దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మొక్కలు నాటారు అలాగే ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




