Rajanagaram: రాజానగరం కుటుంబ కలహాలతో భార్య హత్య.. ఆసుపత్రిలో భర్త!

Rajanagaram: రాజానగరం మండలం చక్రద్వారాబంధంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కుమారిని గొంతునులిమి హత్య చేసిన భర్త నాగరాజు, అనంతరం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 17 Aug 2026 7:20 PM IST
Rajanagaram
X

Rajanagaram: రాజానగరం కుటుంబ కలహాలతో భార్య హత్య.. ఆసుపత్రిలో భర్త!

రాజానగరం: చక్రద్వారాబంధం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త గొంతు నులిమి హతమార్చిన ఘటన కలకలం రేపింది. మట్టపర్తి కుమారి (23)ని భర్త నాగరాజు గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లయిన రెండేళ్లుగా భార్య తనతో సఖ్యతగా ఉండటం లేదని నాగరాజు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రాజమండ్రిలోని జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story