Vishveshwarayapuram: 'తెలుగు' అక్షరాల ఆకారంలో విద్యార్థుల మనోహర మానవహారం!
Vishveshwarayapuram: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం పాఠశాలలో 'తెలుగు' అక్షరాల ఆకారంలో విద్యార్థుల మానవహారం.
Vishveshwarayapuram: 'తెలుగు' అక్షరాల ఆకారంలో విద్యార్థుల మనోహర మానవహారం!
Vishveshwarayapuram: తెలుగు భాషా వైభవాన్ని, మాతృభాష ప్రాధాన్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు తెలుగు దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు “తెలుగు” అక్షరాల ఆకారంలో మానవహారంగా ఏర్పడి ఆకట్టుకున్నారు.
మాతృభాషపై అభిమానం, తెలుగు సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో పలు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. పద్యాల పోటీ, వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
తెలుగు భాషను పరిరక్షించుకోవడంతో పాటు, మాతృభాషలోని సాహిత్య సంపదను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
తెలుగు దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.‘తెలుగు భాష మన గర్వం – తెలుగు భాష మన బాధ్యత’ అనే సందేశాన్ని విద్యార్థులు మానవహారం ద్వారా సమాజానికి చాటిచెప్పారు.




