Ramachandrapuram: ఆర్టీసీ డిపోలో రూ.30 లక్షల కుంభకోణం క్లర్క్ బాగోతం రట్టు
Ramachandrapuram: రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో రూ. 30 లక్షల భారీ కుంభకోణం వెలుగులోకి. విజిలెన్స్ విచారణ, క్లర్క్ ఏపీకే రావు పరార్, పోలీసులకు ఫిర్యాదు.
Ramachandrapuram: ఆర్టీసీ డిపోలో రూ.30 లక్షల కుంభకోణం క్లర్క్ బాగోతం రట్టు
Ramachandrapuram: సుమారు 30 లక్షల వరకు క్యాష్ గల్లంతు, తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు. ఆర్టీసీ డిపోలోపనిచేస్తున్న క్లర్క్ రెండేళ్లుగా చేస్తున్న బాగోతం, రోజుకి పదిమంది డ్రైవర్లు డ్యూటీ చేస్తే, మరో ఐదుగురు డ్రైవర్లు డ్యూటీ చేసినట్లు రికార్డులు రాసి ఆ ఐదుగురు డ్రైవర్ డబ్బులు కాజేసినట్లు ప్రాథమిక విషయాల్లో బహిర్గతమైంది.
ఇటీవల డిపో మేనేజర్ గా బాధ్యతలు తీసుకున్న మూర్తి డబ్బులు పేమెంట్ రికార్థులను పరిశీలిస్తుండగా అనుమానంతో విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డ కుంభకోణం డిపోలో క్లర్క్ గా పనిచేస్తున్న ఎ పి కె రావు ఈ స్కాం కి పాల్పడినట్లు నిర్ధారించిన ఆర్టీసీ సంస్థ విజిలెన్స్,ఆడిటర్స్ గత రెండేళ్లు గా ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించిన అధికారులు.
ఈ విషయం ఎ పి కె రావు కు తెలియడం తో విధులకు గైర్హాజరై, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. ఈ వ్యవహారానికి భాధ్యుడైన ఎ పి కె రావు పై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన డిపో మేనేజర్ మూర్తి.




