Mamidikuduru: మామిడికుదురు కళాశాలల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన!
Mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురులోని దీప్తి, సి. రవితేజ కాలేజీల్లో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్‌ఐవీపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Mamidikuduru: మామిడికుదురు కళాశాలల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన!
మామిడికుదురు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలోని దీప్తి కాలేజ్, సి. రవితేజ జూనియర్ కాలేజీల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు దిశా (డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాళ్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ వి. ప్రతాప్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సమిష్టి అవగాహన, జాగ్రత్తలు, సరైన చికిత్స ద్వారా హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీపై అపోహలను తొలగించుకుని, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
అనంతరం ఏపీసాక్స్ ఆధ్వర్యంలో ముద్రించిన ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు రాజబాబు, జె.కె.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




