Razole: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. జాతీయ రహదారిపై బైఠాయింపు!
Razole: కోనసీమ జిల్లా రాజోలులో రోడ్డు ప్రమాదంలో కొల్లు పూజ మృతి చెందడంతో బాధితులు పోలీస్‌స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.
Razole: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. జాతీయ రహదారిపై బైఠాయింపు!
రాజోలు: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న సోంపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కొల్లు పూజ (29) మృతి చెందింది.
ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బాధితులు రాజోలు పోలీస్‌స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
బాధితుల ఆందోళనతో రాజోలు పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Next Story




