Sakhinetipalli: ప్రాణాలతో పోరాడుతున్న కుటుంబ పెద్ద దాతల సాయం కోసం విజ్ఞప్తి!
Sakhinetipalli: రెండు కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమైన నిరుపేద దుర్గాప్రసాద్. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం.. దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి.
Sakhinetipalli: ప్రాణాలతో పోరాడుతున్న కుటుంబ పెద్ద దాతల సాయం కోసం విజ్ఞప్తి!
Sakhinetipalli: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా - సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామం.
మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం ఖర్చు చేస్తే పెద్దగా తెలియకపోవచ్చు కానీ అదే చిన్న మొత్తం ఒక నిరుపేద కుటుంబానికి ఒక పూట అన్నం కావచ్చు ఒక మందు కావచ్చ ఒక ఆశ కావచ్చు.
మోరిపోడు గ్రామానికి చెందిన రాచపల్లి దుర్గాప్రసాద్ (37) ప్రస్తుతం అలాంటి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
భార్య, 15 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఇదే ఆయన ప్రపంచం. రోజూ కూలీ పనికి వెళ్తేనే పొయ్యి వెలిగే ఈ కుటుంబం ఇప్పుడు కుటుంబాన్ని పోషించే పెద్ద అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యే పరిస్థితికి చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది.
దుర్గాప్రసాద్‌కు గత కొంతకాలంగా రెండు కిడ్నీల పనితీరు గణనీయంగా దెబ్బతింది. రెండు కళ్ల చూపు కూడా మందగించింది. దీనికి తోడు ఒక కాలిలో తీవ్రమైన సమస్య ఏర్పడి, జాయింట్ తప్పిపోవడంతో నడవడం కూడా కష్టంగా మారింది. వైద్యుల సూచన మేరకు కాలుకు శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఒకప్పుడు కుటుంబం కోసం కష్టపడిన చేతులు ఇప్పుడు తన వైద్య ఖర్చుల కోసం ఇతరుల వైపు చూసే పరిస్థితి. ఇది కేవలం ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కథ కాదు. తండ్రి ఆరోగ్యం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు చిన్నారుల కథ.
భర్త ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్న ఓ భార్య కథ. రోజు గడవడమే కష్టమైన ఓ నిరుపేద కుటుంబం కథ.
చికిత్స చేయించుకోవడానికి డబ్బు కావాలి. మందులు కొనడానికి డబ్బు కావాలి. ఇంట్లో పొయ్యి వెలిగించడానికి కూడా డబ్బు కావాలి. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఇవన్నీ ఇప్పుడు అందని భారంగా మారాయి. మనలో ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి మొత్తం భారం మోయాల్సిన అవసరం లేదు.
మనకు చేతనైనంత చిన్న సహాయం చేసినా చాలు. ఒకరు మందుల కోసం సహాయం చేయవచ్చు.. మరొకరు వైద్య పరీక్షలకు చేయూతనివ్వవచ్చు.. ఇంకొకరు కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా ఇవ్వవచ్చు.
మనలో ఒకరి సహాయం అతనికి చికిత్స కావచ్చు మనలో పది మంది చేయూత అతని కుటుంబానికి ధైర్యం కావచ్చు. మనమందరం కలిసి నిలబడితే ఆ కుటుంబానికి మళ్లీ ఆశ చిగురించవచ్చు.
ఈ వార్తను చదివి “నాకు చేతనైనంత చేస్తాను” అని ఒక్కొక్కరు ముందుకు వస్తే.. అది దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎంతో విలువైన అండగా నిలుస్తుంది.
మనిషికి మనిషే అండ. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం కంటే గొప్ప మానవత్వం మరొకటి లేదు.
దుర్గాప్రసాద్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, మానవతావాదులు, మంచి మనసున్న ప్రతి ఒక్కరూ స్పందించి తమకు తోచిన సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి.
మీరు అందించే సహాయం ఎంత చిన్నదైనా వారి దృష్టిలో అది చిన్నది కాదు. అది వారి జీవితంలో ఒక పెద్ద ఆశాకిరణం.
సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన ఫోన్‌పే నంబర్: 8179106345
ఈ సమాచారాన్ని మీకు తెలిసిన మరో పది మందికి చేరవేయండి. మీరు చేయలేని సహాయాన్ని.. మీ ద్వారా మరొకరు చేయవచ్చు.
ఒక షేర్ కూడా ఒక ప్రాణానికి ఆశను చేరవేయగలదు.




