Razole: దిండి-చించినాడ వంతెనపై పునఃప్రారంభమైన భారీ వాహనాల రాకపోకలు
Razole: దిండి-చించినాడ వంతెనపై పునఃప్రారంభమైన భారీ వాహనాల రాకపోకలు. ఏడాది తర్వాత పశ్చిమగోదావరి కలెక్టర్ ఆదేశాలతో ప్రయాణికులకు ఉపశమనం.
Razole: దిండి-చించినాడ వంతెనపై పునఃప్రారంభమైన భారీ వాహనాల రాకపోకలు
Razole: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల నిరీక్షణకు తెరపడింది. దిండి–చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు బుధవారం రాత్రి నుంచి పునఃప్రారంభమయ్యాయి.
వంతెన మరమ్మతుల కారణంగా ఏడాది కాలంగా భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో సమయం, వ్యయభారం పెరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి వంతెనపై భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వడంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో రెండు జిల్లాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.
Next Story




