Sakhinetipalli: సఖినేటిపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి!
Sakhinetipalli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి నూతన ఎస్సైగా హరికోటి శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.
Sakhinetipalli: సఖినేటిపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి!
సఖినేటిపల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైగా హరికోటి శాస్త్రి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సఖినేటిపల్లి ఎస్సైగా విధులు నిర్వహించిన దుర్గా శ్రీనివాస్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై హరికోటి శాస్త్రి మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్సై హరికోటి శాస్త్రి కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.




