Gokavaram: మల్లవరంలో ఉపాధ్యాయుడు అబ్రహం పాల్ పదవీ విరమణ సభ!
Gokavaram: గోకవరం మండలం మల్లవరంలో ఉపాధ్యాయుడు యాళ్ళ అబ్రహం పాల్ పదవీ విరమణ సభ. 33 ఏళ్ల సుదీర్ఘ సేవలను కొనియాడి ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు.
Gokavaram: మల్లవరంలో ఉపాధ్యాయుడు అబ్రహం పాల్ పదవీ విరమణ సభ!
Gokavaram: గోకవరం మండలం మల్లవరం డివిపిఆర్ స్కూల్ ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో యాళ్ళ అబ్రహం పాల్ పదవీ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. అబ్రహం పాల్ మాస్టారు ఎలిమెంటరీ విద్య నుండి పదవ తరగతి వరకు మల్లవరం, పెద్దాపురం, భూపతిపాలెం, డివిపిఆర్ఏ యూపీ, ఏలేశ్వరం లోనూ, ఇంటర్ పెద్దాపురం మహారాణి కాలేజీలోనూ, డిగ్రీ కాకినాడ ఐడియల్ కాలేజీ లోను,బిఈడి 1990 సం.లో నెల్లూరు జిల్లా కావలి లో పూర్తి చేశారని. బిఈడి పూర్తి చేసి 1993 సం.లో స్వర్గీయ యాళ్ళ ప్రసాదరావు కాంతమ్మ స్థాపించిన డివిపిఆర్ఏ యూపీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా, 2020 లో స్కూల్ అసిస్టెంట్ ( సోషల్) ఇప్పటివరకు సుమారు 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉన్నారని.
1992 ఏప్రిల్ 27వ తేదీన అదే పాఠశాలలో పనిచేస్తున్న శారా సులోచన ని వివాహం చేసుకొని యున్నారు. వీరికి ఇరువురు సంతానం పెద్ద కుమార్తె షై ని శ్రీపాల్ కెనడా దేశంలో రీసెర్చ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేయుచున్నారు.రెండవ కుమార్తె సోఫీ శ్రీపాల్ ఎంబిబిఎస్ డాక్టర్ గా రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ లో పనిచేయుచున్నారు.
అబ్రహం పాల్ 2025 సం.లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు.యుటిఎఫ్ ఏర్పాటుచేసిన సైన్స్ ఫైర్ లో రెండవ స్థానం,మండలంలో అనేకసార్లు ప్రథమ బహుమతులు సాధించడం లో వీరు కృషి ఎంతో ఉన్నతమైనదని, పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయడం, విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడంలో అబ్రహం పాల్ మాస్టర్ ఎవరూ సాటిరారు. అమ్మాయిల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం, బాలిక విద్యను ప్రోత్సహించడం మాస్టర్ ప్రత్యేకత. ఉద్యోగంలో చేరినప్పటి నుండి అంకితభావంతో పనిచేస్తూ, జాతీయ పర్వదినాలలో అనేకమంది విద్యార్థులను నాయకులుగా, విచిత్ర వేషాలు వేయించడం, పాఠశాల క్రిస్మస్, పాఠశాల వార్షికోత్సవానికి సంస్కృత కార్యక్రమాలు చేయించడం, అంతే కాకుండా మల్లవరం లూధరన్ సంఘంలో సేవకులకు సలహాదారుడిగా, సహకారిగా, ఆర్థికంగా సహకరిస్తూ, దేవుని సేవా పరిచర్యలో వాడబడుతూ పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడటం, అనేక మంది విద్యార్థులకు చదువు విషయాలలో సలహాలు ఇవ్వడం,విద్యార్థులను చదివించుటకు తెల్లవారి జామున నుండి రాత్రి 11.30 గంటల వరకు విద్యార్థులతో గడపడం వలన వారి హృదయాల్లో చెరగని ముద్ర గా నిలిచిపోయారన్నారు.
ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించారు. హెడ్మాస్టర్ గా అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ విద్యార్థులకు విద్యాబోధన బోధించని రోజంటూ లేదని, అందుకే విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుడిగా నిలిచారని పలువురు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యుటిఎఫ్ నాయకులు,ఎస్ టి యు నాయకులు,పాఠశాల ఉపాధ్యాయులు అబ్రహం పాల్ మాస్టర్ ను శాలువాలతో, బొకేలతో, గజమాలలతో, మెమొంటోలతో, నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి అబ్రహం పాల్ మాస్టర్ ను పువ్వులు జల్లుకుంటూ స్కూల్ నుండి ఇంటి వరకు తీసుకోని వెళ్లారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత యాళ్ళ అబ్రహం పాల్ మాట్లాడుతూ నా రిటైర్మెంట్ కార్యక్రమానికి సుధీర ప్రాంతాల నుండి విచ్చేసి, సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు, తెలియజేశారు.




