Rajahmundry: రాజమండ్రి-కొవ్వూరు మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైళ్ల రాకపోకలు స్థంభన!
Rajahmundry: రాజమండ్రి-కొవ్వూరు మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. విజయవాడ వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికుల తీవ్ర అవస్థలు.
Rajahmundry: రాజమండ్రి-కొవ్వూరు మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైళ్ల రాకపోకలు స్థంభన!
Rajahmundry: తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి-కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ బండి పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రైళ్ల రాకపోకల ఆలస్యంపై ప్రయాణికులు గమనించి తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
ప్రధానంగా ఆలస్యంగా నడుస్తున్న/నిలిచిపోయిన రైళ్లు:
అన్నవరం దగ్గర: ఉదయ్ ఎక్స్‌ప్రెస్
తుని దగ్గర: యలమంచెలి ఏసీ ఎక్స్‌ప్రెస్
నర్సీపట్నం రోడ్డు దగ్గర: ఉదయ్ ఎక్స్‌ప్రెస్
ఎలమంచిలిలో: సింహాద్రి ఎక్స్‌ప్రెస్
పట్టాలు తప్పిన గూడ్స్ బండి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతుండటంతో, త్వరలోనే రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.




