Gokavaram: పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఐదుగురు అరెస్ట్
Gokavaram: గోకవరం శివారు దేవీపట్నం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎస్సై పవన్ కుమార్. రూ.5,200 నగదు స్వాధీనం.
Gokavaram: పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఐదుగురు అరెస్ట్
గోకవరం: గోకవరం శివారు దేవీపట్నం ఆర్ & ఆర్ కాలనీలో పేకాడుతున్నారన్న సమాచారంతో గోకవరం ఎస్సై వి.ఎన్.వి. పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేసి, పెకాడుతున్న 5 గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి నుంచి రూ.5,200 నగదును స్వాధీనం చేసుకొన్నట్లు సోమవారం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ. పవన్ కుమార్ మాట్లాడుతూ, పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని ఆయన కోరారు.
Next Story




