Gokavaram: గోకవరం ఆర్టీసీ డిఎమ్‌కు వినతిపత్రం ఇచ్చిన కూటమి నేతలు!

Gokavaram: గోకవరం ఆర్టీసీ డిఎమ్‌కు ఎన్డీఏ కూటమి నాయకుల వినతిపత్రం. రాజమండ్రి, జగ్గంపేట షటిల్ సర్వీసులు, కాలేజీ సమయాల్లో బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్.

NARAYANA, RAJANAGARAM
Published on: 16 Sept 2026 5:55 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం ఆర్టీసీ డిఎమ్‌కు వినతిపత్రం ఇచ్చిన కూటమి నేతలు!

Gokavaram: విజయవాడ విశాఖపట్నం ద్రాక్షారామ బస్ సర్వీసులు పునరుద్ధరించాలని రాజమండ్రి కి మరిన్ని సర్వీసులు పెంచాలని జగ్గంపేట షటిల్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కాలేజీల సమయంలో తగినన్ని బస్సులు నడపాలని కోరారు డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పైలా శ్రీనివాసరావు, పాలాడి శ్రీనివాసరావు, పల్లేల బాబి, ఆచంట రాజు, గండెడ్డి సన్యాసిరావు,యాళ్ళ శేషు, మోర్తా చిట్టి బాబు, జనసేన నాయకులు మహిపాల పాండు, బిజెపి నాయకులు సత్తి వెంకటరెడ్డి, ముప్పిడి నాగేశ్వరరావు, మండిగ వెంకన్న దొర, ఉంగరాల ఆది విష్ణు ముమ్మిడివరపు రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM