Gokavaram: గోకవరంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ప్రారంభం
Gokavaram: గోకవరం సామాజిక ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్రామీణులకు ఇది ఎంతో మేలుకరమన్నారు.
Gokavaram: గోకవరంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ప్రారంభం
గోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నూతన వాహనాన్ని మంగళవారం నాడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. గోకవరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ
గత వైసిపి ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను మరిచిందని 2014 లో అప్పటి టిడిపి ప్రభుత్వం తల్లి, శిశువు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసారన్నారు.
మరల కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్దించిందని గ్రామీణ ప్రాంత వాసులకు ఇది ఎంతో మేలుకరమని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవసం అయిన తల్లిని, పుట్టిన బిడ్డని ఆరోగ్యవంతంగా ఇంటి వద్దకు చేర్చడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు.




