Gokavaram: వంటగ్యాస్ బుకింగ్ పాత విధానాన్ని కొనసాగించాలి: వరసాల ప్రసాద్!
Gokavaram: వంటగ్యాస్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి తిరిగి 30 రోజులకు తగ్గించాలని డిమాండ్.
Gokavaram: వంటగ్యాస్ బుకింగ్ పాత విధానాన్ని కొనసాగించాలి: వరసాల ప్రసాద్!
గోకవరం: మధ్యతరగతి కుటుంబాలపై వంటగ్యాస్ భారం పెరుగుతోందని 45 రోజులకే గ్యాస్ బుకింగ్ సదుపాయం కల్పించడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దళిత నాయకుడు వరసాల ప్రసాద్ ఆరోపించారు.
ఈ సమస్యపై మంగళవారం గోకవరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన స్థానికులతో కలిసి అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు సంబంధిత వినతి పత్రాన్ని తాసిల్దార్ పినిశెట్టి రామకృష్ణకు అందజేశారు.
ఈ సందర్భంగా వరసాల ప్రసాద్ యాక్ట్ మీడియా తో మాట్లాడుతూ. గతంలో 30 రోజులకు ఒకసారి వంటగ్యాస్ బుకింగ్ చేసుకునే విధానం ఉండేదని, ప్రస్తుతం 45 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకునేలా నిబంధనలు తీసుకురావడం సరైన విధానం కాదన్నారు. సాధారణంగా ఒక గ్యాస్ సిలిండర్ 30 రోజుల్లోనే పూర్తవుతుందని, 45 రోజుల వరకు వేచి ఉండాల్సి రావడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
కట్టెపుల్లలు, బొగ్గులు వంటివి అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు అదేవిధంగా చిన్న దుకాణాలు, టీ కొట్లు, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వారికి కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం భారంగా మారిందన్నారు. దీంతో వంటగ్యాస్ ఉపయోగం పెరిగిందని తద్వారా కుటుంబాలకు వంటగ్యాస్ అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు ప్రైవేట్ పరంగా గ్యాస్ ను అదనపు ధరకు విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు
కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో పలువురు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కమర్షియల్ ధరను తగ్గించి చిరు వ్యాపారులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు గ్యాస్ బుకింగ్ విధానంలో ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని ప్రభుత్వం పరిశీలించి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 30 రోజులకే వంటగ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని గతంలో ఉన్న విధానాన్ని యధావిధిగా కొనసాగించాలని వరసాల ప్రసాద్ ప్రజలు తరఫున విజ్ఞప్తి చేశారు.




