Razole: గోదావరి వరద ఉద్ధృతి రాజోలులో జలమయమైన లోతట్టు ప్రాంతాలు!
Razole: ఎగువ ప్రాంతాల వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది, సఖినేటిపల్లి లంక తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Razole: గోదావరి వరద ఉద్ధృతి రాజోలులో జలమయమైన లోతట్టు ప్రాంతాలు!
Razole: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద నీటి మట్టం పెరగడంతో అధికారులు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
దీంతో దిగువ ప్రాంతమైన రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది సాగర సంగమం పరిసర తీర ప్రాంతాలతో పాటు సఖినేటిపల్లి లంక, అప్పనరామునిలంక, రాజోలు పల్లిపాలెంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
వరద నీరు చేరడంతో అప్పనరామునిలంకకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు సహాయక, రక్షణ చర్యలను చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Next Story




