Rampachodavaram: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: రంపచోడవరం ఈఈ అచ్యుతాచారి

Rampachodavaram: వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఏపీఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రంపచోడవరం ఈఈ అచ్యుతాచారి తెలిపారు.

Prasanna, Rampachodavaram
Published on: 12 Sept 2026 5:23 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: రంపచోడవరం ఈఈ అచ్యుతాచారి

Rampachodavaram: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడే వినాయక మండపాలకు విద్యుత్ శాఖ ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా కల్పించబడుతున్నది.

ఉచిత విద్యుత్ సౌకర్యం పొందదలచిన వినాయక మండప నిర్వాహకులు APEPDCL Eastern Power వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవలెను. సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాలు మరియు శాఖ మార్గదర్శకాలు పాటించిన అర్హ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించబడుతుంది.

మండప నిర్వాహకులు తాత్కాలిక వైరింగ్, విద్యుత్ పరికరాల ఏర్పాటు సమయంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. విద్యుత్ స్తంభాలు, తీగలు మరియు ట్రాన్స్‌ఫార్మర్లకు సురక్షిత దూరం పాటించాలి. అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం చట్టరీత్యా శిక్షార్హం.

విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తిన యెడల వెంటనే సమీప విద్యుత్ కార్యాలయాన్ని లేదా విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించగలరు.

ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించబడాలని విద్యుత్ శాఖ కోరుకుంటున్నదని పి. అచ్యుతా చారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రంపచోడవరం ఒక ప్రకటనలో తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram