Amalapuram: కోనసీమలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు: ఎస్ఈ బి. రాజేశ్వరి వెల్లడి.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 15 Sept 2026 12:58 PM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్!

Amalapuram: ​గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ APEPDCL, సూపరింటెండెంట్ ఇంజనీర్, శ్రీమతి బి. రాజేశ్వరి తెలిపారు. సెప్టెంబరు 14 నుంచి 22 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 3KW, పట్టణాల్లో 5KW వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు.

ఆసక్తిగల నిర్వాహకులు దరఖాస్తులను పూర్తి చేసి స్థానిక AEలకు అందజేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది మండపాలకు వచ్చి ఉచితంగా లైను వేసి మీటరు బిగిస్తారని, డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని ఆమె సూచించారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.