Mummidivaram: ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు – APSSDC ప్రకటన

Mummidivaram: ముమ్మిడివరం AIMS కాలేజ్ SKILL HUB నందు APSSDC ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు. అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన.

SURESH, AMALAPURAM
Published on: 23 Aug 2026 6:32 PM IST
Mummidivaram
X

Mummidivaram: ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు – APSSDC ప్రకటన

ముమ్మిడివరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ.నాగబాబు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ముమ్మిడివరం AIMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని SKILL HUB నందు నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ.నాగబాబు తెలిపారు.

SKILL HUB ద్వారా “Application Developer – Web & Phone” కోర్సును ఉచితంగా అందించనున్నారు. శిక్షణ ద్వారా అభ్యర్థులకు సంబంధిత సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి, శిక్షణ అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణకు ఆసక్తి మరియు అర్హత కలిగిన యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.నిరుద్యోగ యువత,యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ. నాగబాబు కోరారు.మరిన్ని వివరాలు మరియు దరఖాస్తు కోసం సంప్రదించండి

Cell No: 95059 79234

స్థలం: AIMS College of Engineering,ముమ్మిడివరం

శిక్షణ: Application Developer – Web & Phone

సంస్థ: APSSDC – Skill Hub.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story