Amalapuram: పోలీసులపై, ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ పి.వి. సునీల్ తీవ్ర విమర్శలు!
Amalapuram: పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ మాజీ ఐపీఎస్ పి.వి.సునీల్ ఆరోపణలు. గురుకుల పాఠశాలల మూసివేతపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం.
Amalapuram: పోలీసులపై, ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ పి.వి. సునీల్ తీవ్ర విమర్శలు!
Amalapuram: పోలీసులపై అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.సునీల్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు.పోలీసు విధులు తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నారంటూ విమర్శలు.గురుకుల పాఠశాలల వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు.రాష్ట్రంలో మూడు గురుకుల పాఠశాలలు మూసివేయడంపై సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడాద్రిగడ్డ,తాడికొండ, కోట,గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మూసివేసిందని సునీల్ ఆరోపణలు చేశారు.‘ఎక్సలెన్సీ’ పేరుతో 2 వేల మంది విద్యార్థులకు అన్యాయం చేశారంటూ విమర్శలు చేశారు.విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?అంటూ ప్రశ్న.‘ప్రజలను సన్యాసులను చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.గూడూరు ఎమ్మెల్యే సునీల్ అసెంబ్లీలో ఇదే అంశంపై స్పందించడంపై అభినందనలు.
గురుకుల పాఠశాలల సమస్యలపై తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తక్షణం స్పందించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు.గురుకుల విద్యార్థుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు.
మీడియాపై పి.వి. సునీల్ తీవ్ర అసహనం న్యూస్ పేపర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సునీల్.విద్యార్థుల సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




