Sakinetipalli: మానవత్వం: చిన్నారి ఆపరేషన్‌కు రూ.50 వేల విరాళం అందజేత!
Sakinetipalli: కోనసీమ జిల్లా మండలానికి చెందిన చిన్నారి ఫ్యాని గుండె ఆపరేషన్‌కు రూ.8 లక్షలు అవసరం. దాతలు ముందుకు రావాలని కోరుతున్న కుటుంబ సభ్యులు, స్థానికులు.
Sakinetipalli: మానవత్వం: చిన్నారి ఆపరేషన్‌కు రూ.50 వేల విరాళం అందజేత!
Sakinetipalli: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన ఇంజేటి సుజికర్ 7 ఏళ్ల కుమార్తె ఇంజేటి ఫ్యాని Single Ventricle Heart Diseaseతో బాధపడుతోంది. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌లో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయాల్సి ఉండగా, సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
ప్రాంతీయుల సహకారంతో ఇప్పటివరకు రూ.3 లక్షలు సమకూరాయి. ఇందులో భాగంగా జీడీఎంసెంట్ పాల్ న్యూ చర్చ్ తరఫున రూ.50 వేల విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చొప్పల భాస్కరరావు, చొప్పల జాన్ ప్రభాకర్, ఉచ్చుల జాన్, బీర చిట్టిబాబు, సువర్ణ రత్నం, ఓగూరి టాండన్ రాజు, తాడి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి ఫ్యాని త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఆపరేషన్‌కు అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమకూర్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.




