Appanapalli: పచ్చని పెళ్లి పందిరి పర్యావరణహితంగా కోనసీమ సంప్రదాయ వివాహం

Appanapalli: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ అప్పనపల్లిలో పర్యావరణహిత పచ్చని పెళ్లి పందిరి. కొబ్బరి గెలలు, అరటి పిలకలతో తెలుగుదనం ఉట్టిపడేలా వినూత్న కళ్యాణమండపం.

PRABHU, RAZOLE
Published on: 31 Aug 2026 8:47 AM IST
Appanapalli
X

Appanapalli: పచ్చని పెళ్లి పందిరి పర్యావరణహితంగా కోనసీమ సంప్రదాయ వివాహం

Appanapalli: పచ్చని కోనసీమ ప్రకృతి సౌందర్యమే పెళ్లి పందిరిగా మారింది.. కొబ్బరి సిరులే కళ్యాణమండపపు స్తంభాలై మురిశాయి! డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలో ఆదివారం నుదురుమాటి వారి వివాహ వేడుకలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పర్యావరణహిత కళ్యాణమండపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

కోనసీమ సంస్కృతికి ప్రతీకలైన పచ్చని కొబ్బరి గెలలు, అరటి పిలకల మేళవింపుతో మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బ్యాక్‌డ్రాప్‌కు ప్రకృతి ప్రసాదించిన పచ్చదనమే ప్రధాన అలంకరణగా నిలిచింది.

ఎలాంటి కృత్రిమ అలంకరణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సంప్రదాయాన్ని గౌరవిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఈ కళ్యాణమండపాన్ని రూపొందించారు. కోనసీమ సహజ అందాలు, తెలుగు సంప్రదాయాలు, కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించిన ఈ వినూత్న వేదిక వివాహ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. ప్రకృతితో మమేకమైన ఈ పచ్చని పెళ్లి పందిరి కోనసీమ సంప్రదాయ సౌందర్యానికి ఓ చక్కని ప్రతీకగా నిలిచింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story