Qatar: ఖతార్‌లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి!

Qatar: దోహాలోని న్యూసలాట్‌లో వైఎస్సార్‌సీపీ ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించి ఎన్‌ఆర్‌ఐ శ్రేణులు.

PRABHU, RAZOLE
Published on: 2 Sept 2026 11:53 AM IST
Qatar
X

Qatar: ఖతార్‌లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి!

Qatar: వైఎస్సార్‌సీపీ ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఖతార్ లోని న్యూసలాట్ నందు జరిగిన కార్యక్రమంలో జీసీసీ కో-కన్వీనర్ దొండపాటి శశికిరణ్‌తో కలిసి జాఫర్ హుస్సేన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని జాఫర్ హుస్సేన్ పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధులు, ఖతార్ కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జాఫర్ హుస్సేన్‌ను నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story