Rajahmundry: దివాన్‌చెరువు వద్ద తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవరే ప్రాణదాత!

Rajahmundry: రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దివాన్‌చెరువు వద్ద ప్రమాదం తప్పింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 April 2026 11:04 AM IST
Rajahmundry
X

Rajahmundry: దివాన్‌చెరువు వద్ద తప్పిన పెను ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవరే ప్రాణదాత!

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో రాజమండ్రి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో విశాఖపట్నం వైపు బయలుదేరింది. దివాన్‌చెరువు ప్రాంతం దాటిన కొద్దిసేపటికే బస్సు వెనుక టైర్ల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అద్దం (Mirror) ద్వారా దీనిని గమనించిన డ్రైవర్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story