Rajahmundry: జూలై 11న జాతీయ లోక్ అదాలత్.. కేసుల పరిష్కారానికి సునీత పిలుపు!

Rajahmundry: జూలై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి గంధం సునీత సూచించారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 18 Jun 2026 8:11 PM IST
Rajahmundry
X

Rajahmundry: జూలై 11న జాతీయ లోక్ అదాలత్.. కేసుల పరిష్కారానికి సునీత పిలుపు!

Rajahmundry: జూలై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసి, అధిక సంఖ్యలో కేసులను రాజీ ద్వారా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం, తగిన పరిహారం అందించేలా అన్ని ఇన్షూరెన్స్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి గంధం సునీత సూచించారు.

గురువారం ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శ్రీలక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యంలో వివిధ ఇన్షూరెన్స్ సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మోటారు ప్రమాద పరిహారం, సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులతో పాటు రాజీకి అనుకూలమైన ఇతర కేసులను గుర్తించి వాటి జాబితాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు త్వరితగతిన అందజేయాలని సూచించారు.

అలాగే రాజీ ద్వారా పరిష్కరించదగిన అన్ని కేసులను ముందుగానే గుర్తించి, సంబంధిత పక్షాలతో సమన్వయం చేసుకుని జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇన్షూరెన్స్ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ఇది సమర్థవంతమైన వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story