Antarvedi: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిత్యాన్నదానానికి రూ.1 లక్ష విరాళం

Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు కొవ్వూరుకు చెందిన దంపతులు రూ. 1,00,000 విరాళం సమర్పించారు.

PRABHU, RAZOLE
Published on: 23 Aug 2026 6:57 PM IST
Antarvedi
X

Antarvedi: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిత్యాన్నదానానికి రూ.1 లక్ష విరాళం

అంతర్వేది: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1 లక్ష విరాళంగా అందింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీ అన్నాబత్తుల నితిన్, శ్రీమతి కమల్ చైతన్య దంపతులు ఆలయ నిత్యాన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయంగా రూ.1,00,000 విరాళాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది వారి తరఫున సమర్పించిన విరాళాన్ని స్వీకరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదాన్ని అందించేందుకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ఆలయ వర్గాలు తెలిపారు.

ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాలు అందించడం ద్వారా భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి మరింత తోడ్పాటు లభిస్తుందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ పేర్కొన్నారు. స్వామివారి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న దాతలకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story