Amalapuram: ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర: రాజేంద్రప్రసాద్!

Amalapuram: నిరుద్యోగ భృతి, రొయ్యల మేత ధరల తగ్గింపు, కౌలు రైతులకు రుణాలకై సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 10 Aug 2026 11:05 PM IST
Amalapuram
X

Amalapuram: ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర: రాజేంద్రప్రసాద్!

అమలాపురం: అధిక ధరలను నియంత్రించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని, రైతులకు లాభసాటి ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో రెండో విడత పాదయాత్ర కొనసాగింది.

మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, దళితులు, ఆదివాసీలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టాలని, రొయ్యల మేత ధరలను తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

అమలాపురం బస్టాండ్‌ నుంచి గడియార స్తంభం సెంటర్, నల్ల వంతెన, ఎర్ర వంతెన వరకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ప్రజలకు, వ్యాపార వర్గాలకు సమస్యలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మేలు చేసే విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కే. సత్తిబాబు, నాయకులు పుల్లెల ఆనంద్, గుడాల వెంకటరమణ, కురచా నాగేశ్వరరావు, కాళ్ల భీమరాజు, ఏఐటీయూసీ నాయకులు పద్మ, కుడిపూడి సత్యనారాయణ, అయితాబత్తుల వెంకటసుబ్బారావు, రొక్కాల సత్యనారాయణ, ఉగ్గిరాల నవీన్, కొప్పిశెట్టి బులిసత్తియ్య, ఏళ్ల రామారావు, ఇళ్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story