Mamidikuduru: చదువే జీవితం కావాలి విద్యార్థులకు డీఈఓ మహబూబ్‌ బాషా పిలుపు!

Mamidikuduru: మామిడికుదురు మండలం ఈదరాడ జడ్పీ పాఠశాలను సందర్శించిన డీఈఓ మహబూబ్‌ బాషా. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుపై శ్రద్ధ వహించాలని సూచన.

PRABHU, RAZOLE
Published on: 31 Aug 2026 6:35 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: చదువే జీవితం కావాలి విద్యార్థులకు డీఈఓ మహబూబ్‌ బాషా పిలుపు!

Mamidikuduru: విద్యార్థులు చదువునే జీవిత పరమార్థంగా భావించి, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మహబూబ్‌ బాషా సూచించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం ఈదరాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న విద్యాబోధన, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన డీఈఓ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యతో పాటు నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు పట్టుదలతో శ్రమించాలని అన్నారు.

చదువుతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, నిరంతర సాధనతోనే జీవితంలో విజయాలను అందుకోవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో డీవైఈఓ జి. కిశోర్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎం జి. సాయిబాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story