Amalapuram: తప్పుడు కథనాలు సహించం. హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల ఆగ్రహం!

Amalapuram: అమలాపురంలో అంబేద్కర్‌పై తప్పుడు కథనాలతో కూడిన పుస్తకంపై దళిత సంఘాల ఆగ్రహం. రచయిత హమారా ప్రసాద్‌పై చర్యలు కోరుతూ బుద్ధ విహార్‌లో అత్యవసర భేటీ.

SURESH, AMALAPURAM
Published on: 27 Aug 2026 12:09 PM IST
Amalapuram
X

Amalapuram: తప్పుడు కథనాలు సహించం. హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల ఆగ్రహం!

Amalapuram: కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని తక్షణం నిలిపివేయాలి దళిత సంఘాల డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి. హమారా ప్రసాద్ వెనుక ఉన్న శక్తులు ఎవరు దళిత సంఘాల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.అంబేద్కర్ అంశంపై దళిత సంఘాల ప్రశ్న వర్షం కురిపించారని.కల్పిత నాయకుడు’ పుస్తకంపై అమలాపురం బుద్ధ విహార్‌లో అత్యవసర భేటీ అయ్యారు. అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు దళిత సంఘాల హెచ్చరిక జారీ చేశారు.

అంబేద్కర్‌పై తప్పుడు కథనాలు,అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని దళిత సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరించారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బుద్ధ విహార్‌లో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు డీ.బీ. లోక్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘కల్పిత నాయకుడు’ పుస్తక రచయిత హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబేద్కర్‌పై, భారత రాజ్యాంగంపై అవాస్తవాలు,అసత్య కథనాలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పుస్తకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్రను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం,అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హమారా ప్రసాద్ వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్న చీకటి శక్తులను కూడా దళిత సంఘాల నేతలు హెచ్చరించారు.

ఇలాంటి వ్యాఖ్యలు,ప్రచారాలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని,ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కల్పిత నాయకుడు’ పుస్తకంలోని అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, దేశ సమగ్రతకు,సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే అంశాలు ఉంటే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంతటి వివాదం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి ఉరితీయాలని డిమాండ్ చేశారు త్వరలో భారీ ఆందోళన చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలోని పోలీస్ స్టేషన్లో హమారా ప్రసాద్ పై ఫిర్యాదులు చేస్తామని ప్రకటించారు

ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక చైర్మన్ డీ.బీ.లోక్, మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎం.ఏ.కె. భీమారావు,కన్వీనర్ జంగా బాబురావు,ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు,ట్రెజరర్ గడ్డం సురేష్ బాబు,సంయుక్త కార్యదర్శి రేపు తిరుపతిరావు, బుద్ధ విహార్ సెక్రటరీ కాశీ వెంకటరావు,మహిళా శక్తి కన్వీనర్ కొంకి రోజామణి తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story