Chintoor: ఏజెన్సీ విద్యాభివృద్ధికి దూలయ్య చేసిన సేవలు మరువలేనివి!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో దివంగత ఉపాధ్యాయుడు ముర్రం దూలయ్య పెద్దకర్మ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
Chintoor: ఏజెన్సీ విద్యాభివృద్ధికి దూలయ్య చేసిన సేవలు మరువలేనివి!
Chintoor: ఉపాధ్యాయ వృత్తిలో తనకంటూ ఒక నిబద్ధత క్రమశిక్షణతో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమందికి విద్యాభ్యాసం అందించిన ముర్రం దూలయ్య సేవలు మరువలేనివి అని సిపిఎం జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్ అన్నారు. ఉపాధ్యాయుడు దూలయ్య చిత్రపటం వద్ద రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ జిల్లా మండల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఎర్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని కిరణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని చేసుకుంటూ సంఘంలో కూడా చురుకుగా కార్యక్రమాలను పాల్గొని ప్రజలకు చేరువైన ఉపాధ్యాయుడుగా దూలయ్య నిలిచాడని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో విద్యను అందించే క్రమంలో నిబద్ధతగా వ్యవహరించారని కొని ఆడారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పల్లపు వెంకట్,సీసం సురేష్,మొట్టం రాజయ్య,సున్నం రాజులు,యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పండ కృష్ణయ్య,సుందరయ్య,సుబ్బారావు, కుటుంబ సభ్యులు ముర్రం రంగమ్మ, కవిత, రవి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.




