Malikipuram: నిత్యావసరాలు, ఇంధన ధరలు తగ్గించాలి: దేవ రాజేంద్రప్రసాద్!
Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది.
Malikipuram: నిత్యావసరాలు, ఇంధన ధరలు తగ్గించాలి: దేవ రాజేంద్రప్రసాద్!
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురంలో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఆగస్టు 15 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన దేవ రాజేంద్రప్రసాద్.. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొని తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, రైతులను ఆదుకోవాలని, నిరుద్యోగులకు భృతి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీలు, దళితులపై దాడులను అరికట్టడంతో పాటు మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నివారించాలని కోరారు.
ప్రజలపై భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు, ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని దేవ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన తాతారావు,దేవ సురేష్, పి.ఆనంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




