Amalapuram: లాబ్‌లు వాడి నైపుణ్యాలు పెంచుకోండి: కలెక్టర్ మహేష్
Amalapuram: మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేసిన కలెక్టర్ మహేష్ కుమార్. లాబ్‌లను వాడి సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు.
Amalapuram: లాబ్‌లు వాడి నైపుణ్యాలు పెంచుకోండి: కలెక్టర్ మహేష్
అమలాపురం: విద్యార్థులు ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రయోగాల ద్వారా విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ సూచించారు.
గురువారం అమలాపురంలోని వి. అగ్రహారం మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 24న జరిగే మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 4.0కు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరుకావాలని కోరారు. ప్రయోగశాలల్లో నిర్వహించే ప్రయోగాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, ప్రయోగశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు తదితర సామగ్రి ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి. మమ్మీ, జిల్లా విద్యాశాఖ అధికారి వి. నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




