Amalapuram: కలెక్టరేట్‌లో ప్లాస్మా ప్లాంట్ వ్యర్థాల నిర్వహణపై సమీక్షా సమావేశం
Amalapuram: కలెక్టరేట్‌లో ప్లాస్మా ప్లాంట్ వ్యర్థాల నిర్వహణ, తడి-పొడి చెత్త సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.
Amalapuram: కలెక్టరేట్‌లో ప్లాస్మా ప్లాంట్ వ్యర్థాల నిర్వహణపై సమీక్షా సమావేశం
అమలాపురం: జిల్లాలో మండల,గ్రామ స్థాయిలో తడి- పొడి చెత్త సేకరణ పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు.ఈ రోజు స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు మున్సిపల్, పంచాయతీ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారులతో ప్లాస్మా ప్లాంట్ వ్యర్ధాల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్మా ప్లాంట్ వ్యర్ధాల నిర్వహణపై మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్లాస్మా ప్లాంట్ ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణలో ఈటీపీ రిపోర్టును తీసుకుని శాఖల మధ్య సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా ప్లాస్మా ప్లాంట్లో తడి పొడి చెత్త నిర్వహణలో భాగంగా తడి చెత్త ఎక్కువ సేకరణ జరుగుతుందని,దాని కారణంగా వ్యర్ధాల నిర్వహణలో పొడి చెత్త సేకరణ తక్కువుగా జరుగుతుందన్నారు.అందుచేత మండల గ్రామస్థాయిలో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణపై మున్సిపల్ పంచాయతీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్,జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మురళీకృష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఈఈ డి.రాజబాబు,మున్సిపల్ ఏఈ ఆర్. వెంకటేష్,మిరాయి కంపెనీ ప్రతినిధులు భరత్,ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




