Ambajipeta: ఎమ్మెల్యే గిడ్డి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

Ambajipeta: అంబాజీపేటలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

RAJU, P GANNAVARAM
Published on: 9 Sept 2026 5:50 PM IST
Ambajipeta
X

Ambajipeta: ఎమ్మెల్యే గిడ్డి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

అంబాజీపేట: ​‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా అంబాజీపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, స్థానిక పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పనితీరును, ఆయన అంకితభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

​ఎమ్మెల్యే సత్యనారాయణ ఒక విద్యావంతుడని,నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం తపనపడే సమర్థుడైన నాయకుడని సీఎం కొనియాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తెస్తూ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు.

​ఇదే సందర్భంలో సీఎం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే తిరుగులేని ఫలితాలు వస్తాయని, 2029 ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులందరూ మళ్లీ విజయం సాధించాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కష్టానికి, నాయకత్వానికి తగిన ఫలితం రావాలని కోరుతూ, ప్రజా ప్రతినిధులందరూ బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కూటమి నాయకులకు, కార్యకర్తలకు సమాజంలో తగిన గౌరవం కాపాడటం సహా ప్రజా సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన వివరించారు. ప్రజాప్రతినిధులు 24/7 ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులో ఉంటూ, సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగాలని సీఎం సూచించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story