Razole: గొల్లపాలెంలో విషాదం.. డ్రెయిన్‌లో పడి పదో తరగతి విద్యార్థి మృతి
Razole: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో విషాదం.
Razole: గొల్లపాలెంలో విషాదం.. డ్రెయిన్‌లో పడి పదో తరగతి విద్యార్థి మృతి
రాజోలు: డాక్టర్. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండుమేను శ్రీరామ్ (16) ప్రమాదవశాత్తు డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గుండుమేను శ్రీనివాస్ యాదవ్‌కు ఏకైక కుమారుడైన శ్రీరామ్ తన స్నేహితులతో కలిసి కాలువ వద్ద బంతి ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో బంతి కాలువలోని లోతైన ప్రాంతానికి వెళ్లడంతో దానిని తీసుకురావడానికి ప్రయత్నించిన శ్రీరామ్ ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లి గల్లంతయ్యాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టగా, సోమవారం తెల్లవారుజామున శ్రీరామ్ మృతదేహం లభ్యమైంది.
ఇటీవలే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన శ్రీరామ్ ఇంటర్మీడియట్‌లో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.




