Lakkavaram: లక్కవరంలో చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు!
Lakkavaram: అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు. ఆంజనేయ స్వామి గుడిలో పూజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన అభిమానులు.
Lakkavaram: లక్కవరంలో చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు!
Lakkavaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరం లోని మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులు భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తమకు స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఆయన పుట్టినరోజు వారోత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిశాల బాలాజీ, గుండాబత్తుల తాతాజీ, కోళ్ల బాబి, రావి మురళి, నామన నాగభూషణం, వులిశెట్టి లక్ష్మణరావు, మెగా యూత్ ఫోర్స్ మండల అధ్యక్షుడు బోణం చంటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.




