Chintoor: చింతూరులో ఓటర్ల ఆందోళన: బీఎల్వోపై చర్యలకు డిమాండ్!
Chintoor: చింతూరు మండలం చట్టి గ్రామంలో బీఎల్వో నిర్లక్ష్యం వల్ల 343 బూత్‌లోని 321 మంది ఓటర్లకు నోటీసులు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Chintoor: చింతూరులో ఓటర్ల ఆందోళన: బీఎల్వోపై చర్యలకు డిమాండ్!
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలోని 343 బూత్ కు చెందిన ఓటర్లు తాము ఓటును కోల్పోతే ఉపేక్షించమని ఆందోళన వ్యక్తం చేశారు. బిఎల్ఓ సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) ఎన్యుమరేషన్ ఫామ్ లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో తమకు నోటీసులు వచ్చాయని, దీంతో తాము ఓటును కోల్పోయే అవకాశం ఉందని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
343 బూత్ లో 321 మంది ఓటర్లు ఉన్నామని అందరికీ నోటీసులు రావడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫామ్ లు ఓటర్లకు అందించకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. దీంతో తాము సర్ ఎన్యుమరేషన్ ఫామ్ లు పూర్తి చేయలేదని దీంతో తమకు నోటీసులు వచ్చాయని వాపోయారు.
నోటీసులు అందుకొని సచివాలయానికి వస్తే సంబంధిత అధికారులు ఇప్పుడు డాక్యుమెంట్స్ అందించిన ఓటు హక్కు ఉంటుందో లేదో చెప్పలేమని తెలపడంతో స్థానికులు ఆందోళన చెందారు. తాము ఓటు హక్కును కోల్పోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.




