Chintoor: వెంకటరామాపురం బడిలో తాగునీటి తిప్పలు విద్యార్థుల ఆవేదన!
Chintoor: చింతూరు మండలం వెంకటరామాపురం పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల తీవ్ర అవస్థలు. అధికారులు స్పందించి సమస్యను తీర్చాలని డిమాండ్.
Chintoor: వెంకటరామాపురం బడిలో తాగునీటి తిప్పలు విద్యార్థుల ఆవేదన!
Chintoor: పాఠశాలలో తాగటానికి మంచినీరు సౌకర్యం లేకపోవడంతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని వెంకటరామాపురం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 11 మంది, అంగన్వాడి లో 14 మంది విద్యార్థులు మొత్తంగా 25 మంది విద్యార్థులు చదువుతున్నారు.
తాము నిత్యం పాఠశాలకి వస్తున్నామని నీటి సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఎటువంటి చొరవ చూపటం లేదని అన్నారు. మంచినీటి కోసం చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. చదువుకుందామని పాఠశాలకు వస్తే మంచినీరు లేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అలాగే పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మత్తులకు గురయ్యాయని వాటిని రిపేర్ చేసే నాధుడే లేరని అన్నారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అసలు ఉన్నారా అని ప్రశ్నించారు మారుమూలలో మా పాఠశాల ఉండడంతో మా పాఠశాలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అన్నారు.ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మా పాఠశాలను ఒక్కసారి సందర్శించి తాము పడుతున్న కష్టాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.




