Rajamahendravaram: పోలవరం పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్‌తో బిజెపి నేతల చర్చ!

Rajamahendravaram: పోలవరం ప్రాజెక్టు ఆధారంగా పర్యాటక అభివృద్ధి, గ్రీన్‌ఫీల్డ్ హైవే కనెక్టివిటీపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తిని కలిసిన బిజెపి నేతలు ఎపిఆర్ చౌదరి, మంగరాజు.

NARAYANA, RAJANAGARAM
Published on: 4 Sept 2026 3:54 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: పోలవరం పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్‌తో బిజెపి నేతల చర్చ!

Rajamahendravaram: పోలవరం ప్రాజెక్ట్ ను ఆధారం గా చేసుకుని జరుగు టూరిజం అభివృద్ధి నిమిత్తం, ప్రాజెక్ట్ కు ఎడమ వైపు నుండి కనెక్టివిటీ రహదారులు, అమరావతి నుండి పోలవరం ప్రాజెక్ట్ గుండా పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిసిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కు సంబందించి ఈ ప్రాంతం లో ఎ లైన్ మెంట్ గురించి, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి రాజమహేంద్రవరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల నుండి కనెక్టివిటీ, పోలవరం ప్రాజెక్ట్ కు ఎడమ వైపు రోడ్డు కనెక్టివిటీ, వివిధ రకాల టూరిజం మోడళ్ళ, టూరిజం హబ్ లు, టూరిజం సర్క్యూట్స్ అభివృద్ధి దీని వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలు పై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి ని బిజెపి సీనియర్ నాయకులు ఎపిఆర్ చౌదరి మట్ట మంగరాజు కలసి సుదీర్ఘంగా చర్చించి సోదాహరణంగా మ్యాప్, రిపోర్ట్ ల సహాయం తో వివరించడం జరిగింది.

దీనికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ దిశ లో ఈ ప్రాంతాన్ని పర్యాటకం గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story