Gokavaram: దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం!
Gokavaram: గోకవరం డ్రైవర్స్ కాలనీ కనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రూ.5 లక్షలు ప్రకటించి తొలి విడతగా రూ.లక్ష చెక్కును అందించారు.
Gokavaram: దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం!
Gokavaram: గోకవరం గ్రామం డ్రైవర్స్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంబాల శ్రీనివాసరావు అండగా నిలిచారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించి, అందులో భాగంగా తొలి విడతగా రూ.లక్ష విరాళం చెక్కును అందజేశారు.
రాబోయే దేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని, శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయఅభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కంబాల శ్రీనివాసరావుని కోరటం జరిగింది . వారి విజ్ఞప్తికి స్పందించిన కంబాల శ్రీనివాసరావు ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా తొలి విడతగా రూ.లక్ష చెక్కును బుధవారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కంబాల శ్రీనివాసరావు తెలిపారు.
దేవి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించడానికి ముందుంటానని పేర్కొన్నారు. కంబాల శ్రీనివాసరావు అందించిన సహాయానికి ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.




