East Godavari: రాజమండ్రిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. రాకపోకలు బంద్!
East Godavari: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పోలీస్ క్వార్టర్స్ - శ్రీరాంపురం మార్గంలో భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది.
East Godavari: రాజమండ్రిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. రాకపోకలు బంద్!
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ చెట్టు కూలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పోలీస్ క్వార్టర్స్ నుండి శ్రీరాంపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం అడ్డంగా పడిపోయింది.
ప్రమాదకరంగా మారిన రహదారి:
జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ మార్గంలో ఒక్కసారిగా చెట్టు కూలడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రోడ్డుకు అడ్డంగా చెట్టు ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనచోదకులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది.
Next Story




