Mummidivaram: చెయ్యేరులో మొహర్రం వేడుకలు.. బీబీ సఖీనాకు ఘన నివాళి!
Mummidivaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గ్రామంలో మొహర్రం సంతాప కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
Mummidivaram: చెయ్యేరులో మొహర్రం వేడుకలు.. బీబీ సఖీనాకు ఘన నివాళి!
ముమ్మిడివరం: మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గ్రామంలో ఆదివారం మజిలీస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని అలీనగర్ హజరత్ అబ్బాస్ పంజా వద్ద జరిగిన మజిలీస్‌లో మత ప్రబోధకులు అఖిల్ తురాబి కర్బలా విషాద గాథను వివరిస్తూ ప్రసంగించారు.
కర్బలా యుద్ధంలో జరిగిన త్యాగాలు, ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ బీబీ సఖీనాకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల్లో ఊరేగించి మాతం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్లకు మొక్కులు తీర్చుకుని ప్రార్థనలు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి శ్రద్ధల మధ్య సాగింది.
Next Story




