Antarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ₹1.50 లక్షల విరాళం!
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భీమవరం దంపతులు రూ.1.50 లక్షల విరాళం అందజేశారు. సుదర్శన హోమం, నిత్యాభిషేకానికి కానుక.
Antarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ₹1.50 లక్షల విరాళం!
Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే సుదర్శన హోమానికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు పెనుమత్స వెంకటరామరాజు, దుర్గా నాగమణి దంపతులు శాశ్వత విరాళంగా రూ.1,00,000 సమర్పించారు. అలాగే శాశ్వత నిత్యాభిషేకానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. మొత్తంగా రూ.1,50,000 విరాళాన్ని ఆలయానికి సమర్పించారు.
విరాళం సమర్పించిన దంపతులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ పి. విజయసారథి వారి చేతుల మీదుగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ ఏసీ వరప్రసాద్ తెలిపారు.
Next Story




