Rajanagaram: 18 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!
Rajanagaram: మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పంపిణీ చేశారు.
Rajanagaram: 18 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ!
రాజానగరం: నియోజకవర్గంలోని కోరుకొండ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్స అనంతరం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఎమ్మెల్యే సతీమణి, జనసేన పార్టీ 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా గాడాల గ్రామానికి చెందిన గంగాధర వెంకటరమణకు రూ.36,819, నిడిగట్ల గ్రామానికి చెందిన చలంశెట్టి లక్ష్మణరావుకు రూ.54,908, కాపవరం గ్రామానికి చెందిన కేశినేని నరసింహకు రూ.28,734, కోరుకొండ గ్రామానికి చెందిన తాటికొండ అమ్మిరాజుకు రూ.57,719, నల్లల భగవంతుడికి రూ.77,558, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన బత్తుల సరోజినికి రూ.30,028, కోటి గ్రామానికి చెందిన చుంచు శిరీషకు రూ.45,227, కోటికేశవరం గ్రామానికి చెందిన ఎరుల్లా రమేష్‌కు రూ.1,15,738, బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన నక్కా మంగకు రూ.62,160, జంబూపట్నం గ్రామానికి చెందిన పితాని నాగమల్లేశ్వరికి రూ.37,378 విలువైన చెక్కులను అందజేశారు.
అలాగే నర్సాపురం గ్రామానికి చెందిన రాయపాటి శివాజీకి రూ.52,522, నాగ ప్రసాద్‌కు రూ.16,084, కనుపూరు గ్రామానికి చెందిన సీరం సీతామహాలక్ష్మికి రూ.17,114, పెంటకోటి విజయకుమారికి రూ.70,105, విరొటి త్రిమూర్తులకు రూ.43,034, అమరశెట్టి వీర బాపనయ్య స్వామికి రూ.24,145, గాదరాడ గ్రామానికి చెందిన పాలం నాగేంద్రప్రసాద్‌కు రూ.20,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




