Amalapuram: 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: అమలాపురంలో ఉద్యోగుల భారీ ధర్నా
Amalapuram: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో బ్యాంకు ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు.
Amalapuram: 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: అమలాపురంలో ఉద్యోగుల భారీ ధర్నా
Amalapuram: అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ప్రదర్శనలు చేశారు.సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగుల సమ్మె చేస్తామన్నారు.
గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ నెలలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.




