Malikipuram: విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం: రాజోలు సీఐ!
Malikipuram: మలికిపురం లక్కవరంలో ASWA ఆధ్వర్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లు, క్లీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Malikipuram: విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం: రాజోలు సీఐ!
మలికిపురం: ఆల్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ASWA) అధ్యక్షులు పోలిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలోని అన్ని విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, క్లీనర్లకు మలికిపురం మండలం లక్కవరం ఎంజీ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజోలు సీఐ సురేష్ బాబు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి (DyEO) కిషోర్ బాబు, మలికిపురం ఎస్‌ఐ మోహన్ కుమార్, రాజోలు ఎంఈఓ నరసింహమూర్తి, మలికిపురం ఎంఈవో విజయశ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ, చిన్నారుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు ఎంతో మంది విద్యార్థులు పాఠశాల బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని పేర్కొన్నారు. బస్సులతో ఓవర్‌టేకింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.
డీవైఈఓ కిషోర్ బాబు మాట్లాడుతూ, డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్, బస్సు ఫిట్‌నెస్ పత్రాలను ఎల్లప్పుడూ సక్రమంగా ఉంచుకోవాలని, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, ప్రతి రోజూ ఎమర్జెన్సీ డోర్‌ను తనిఖీ చేయాలని సూచించారు.
ఈ అవగాహన సదస్సుకు సుమారు 400 మంది బస్సు డ్రైవర్లు, క్లీనర్లు హాజరయ్యారు. విద్యార్థుల భద్రత కోసం ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఎస్‌డబ్ల్యూఏ అధ్యక్షులు పోలిశెట్టి గణేష్‌ను పాల్గొన్న అధికారులు, డ్రైవర్లు అభినందించారు.




