Antarvedi: అంతర్వేదిలో ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం!
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం. స్వాతి నక్షత్రం సందర్భంగా 108 కలశాలతో పవిత్ర జలాలతో పంచామృతాభిషేకం.
Antarvedi: అంతర్వేదిలో ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం!
Antarvedi: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శుక్రవారం అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం 108 కలశాలలో స్వామివారి 108 అష్టోత్తర నామాలతో ఆవాహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన కలశాన్ని శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం 108 కలశాలలోని పవిత్ర జలాలతో స్వామివారికి పంచామృతాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఏసీ వరప్రసాద్ ఈ వివరాలను తెలిపారు.
Next Story




