Razole: డిగ్రీ కళాశాలలో ఘనంగా ఏఐ సెమినార్!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'కృత్రిమ మేధస్సు – నేటి యుగం'పై ఒకరోజు సెమినార్ నిర్వహించారు.
Razole: డిగ్రీ కళాశాలలో ఘనంగా ఏఐ సెమినార్!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో "కృత్రిమ మేధస్సు – నేటి యుగం" అనే అంశంపై ఒకరోజు సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన డాక్టర్ కడిలి శ్యామ్ బెనగల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ బెనగల్ మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు ప్రభావం విస్తృతంగా పెరుగుతోందని, విద్యార్థులు ఏఐ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా విద్యలోనూ, వృత్తి జీవితంలోనూ ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని విజయాలను సాధించేందుకు ఏఐ ఒక కీలక సాధనమని తెలిపారు.
ప్రస్తుతం INTEL సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన, తన అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారికి విలువైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నల్లి రాజు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు వరప్రసాద్, గోపాలకృష్ణ, శ్రీమూర్తి, కడలి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.




